04 January, 2009

ద్వితీయం

సావిత్రి రామనాధంని పెళ్లిచేసుకునేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించింది. ముఫైఅయిదేళ్ల వయసువరకు పెళ్లి లేకుండా గడిచిపోయింది కాని మిగతా జీవితం ఏఆసరా లేకుండా బ్రతకాలంటే చాలా కష్టమని వూగిసలాడింది. రామనాధం రెండోపెళ్లి కోసం యిచ్చిన ప్రకటన చూసి ఎంతో ఆలొచించుకుని ప్రకటనకి జవాబిచ్చింది. మూడోనాటికల్లా అతనివద్దనుంచి జవాబు వచ్చింది ఆదివారంకలుసుకుని మాట్లాడుకుందికి ఏర్పాటయింది. అనుకున్నటైముకి హొటల్ రెసెప్షన్ వద్ద యిద్దరూ కలుసుకుని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.రామనాధం బుక్ చేసిన టేబిల్ వద్ద యిద్దరూ కూర్చున్నారు.సంభాషణ రామనాధమంమొదలు పెట్టాడు."నేను బేంక్ ఆఫ్ ఇండియాలో మేనేజరుగా వర్క్ చేస్తున్నాను. నాభార్యపొయి నాలుగు సంవత్సరాలయింది ఆరు సంవత్సరాల అమ్మాయివుంది నాకు నలభై ఏళ్లు.నాభార్య పోయినతరువాత పెళ్లి చేసుకోకుండా పాపని పెంచుకుంటూ శేష జీవితం గడుపుదామనుకున్నాను కాని వుద్యోగం చేస్తూ పిల్ల మంచిచెడ్డలు చూసుకోవడం నావల్లకాలేదు ఏపనికీ న్యాయం చెయ్యలేకపోయాను అందుకోసమని పెళ్లిచేసుకోవాలనుకుని ప్రకటన యిచ్చాను.నాకు వెనుకా ముందూ ఎవరూలేరు క్లుప్తంగా యిది నాపరిచయం యిక మీగురించి చెప్పండి." రామనాధం చేప్పినంత సింపుల్ గా సావిత్రి తన పరిచయంచెప్పలేకపోయింది. ధైర్యం కూడదీసుకుని చెప్పడం ప్రారంభించిది"నా పేరు సావిత్రి నావయసు ముఫైఅయిదేళ్లు తల్లితండ్రి చిన్నప్పుడేపోయారు మేనమామ పేంచాడు సైకాలజీలో ఎమ్మె చేసాను .యిన్నాళ్లైసరయిన జాబ్ దొరకలేదు .ఏవో చిన్న వుద్యోగాలు టెంపరరీ వుద్యోగాలు చేశాను. మామయ్య పోయి మూడేళ్లయింది పెంచి పెద్ద చేసిన అత్తని వదిలి పెట్టకుండా ఈ మూడేళ్లు గడిపాను ఆమెకూడా నాలుగునెలలక్రితం చనిపోయింది నాకూ నాఅన్నవాళ్లెవరూ లేరు. యిన్ని రోజులూ వివాహం గురించి ఆలోచనకూడారాలేదు.మీ ప్రకటన చూశాక నాకూ జీవితంలో ఒకతోడు అవసరంఅన్న వూహ కలిగింది. అంతే తప్ప వైవాహిక జివితం యిలావుండాలి అలావుండాలి అన్న అభిప్రాయలేవీలేవు.యింతకన్నా నాగురించి చెప్పడానికేమిలేదు." మనం ఒక్కసారి కలుసుకుని ఎటువంటి నిర్నయం తీసుకోకూడదు, నాకు భార్యకన్న నాబిడ్డకు తల్లిగా వస్తే నేను సంతోషిస్తాను. మా పాప పేరు స్వాతి,తల్లి పోవడం సరైన మార్గదర్శకత్వంలేక కాస్త మంకుగా ప్రవర్తిస్తుంది.నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం ఆమె మనసు మీద ఎటువంటి ప్రభావం కలుగుతుందో తెలియదు". చాలా ప్రశాంతంగా చెప్పాడు రామనాధం."సరే ఒకలా చేద్దాం ఈ అవకాశాన్ని దృష్టిలోఉంచుకుని నన్ను మీ పాప మంచి చెడ్డలు చూసుకుందికి నన్ను అప్పాయింట్ చేసినట్లు చెప్పి మీ యింటికి తీసుకు వెళ్లండి.మూడునెలలనుండి ఆరునెలలవరకు కేవలం మీపాపకు తల్లిగానడుచుకుంటాను. ఈ ప్రయత్నంలో నేను సక్సెస్ అయితే ఆతరువాత మనం పెళ్లి చేసుకోవచ్చు లేదా మనం స్నేహితులుగా విడిపోవచ్చు".సావిత్రి అభిప్రాయం విన్నాక రామనాధం నిశ్చేష్టుడయ్యాడు, భూమి మీద యింకా మంచితనం మిగిలివుందని భావించాడు అయితే సందేహంగా "అన్నాళ్లు నావద్ద మీరు వుంటె నలుగురూ నాలుగువిధాలుగా అనుకుంటారేమో!" సందేహం వెలిబుచ్చాడు. "ఈముఫై అయిదేళ్ల జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు సమస్యలతో సతమతమయ్యాను. లోకం నన్ను చూసి ఏమనుకుంటుందోనని ఆలోచించే శక్తి నాలో మిగలలేదు.మీరు పాపగురించి చెప్పారు,తల్లిలేని పిల్ల ఎంత అసహాయంగా ఫీలవుతుందో నాకు బాగా అనుభవం.నేను సైకాలజీ సబ్జెక్టు తీసుకుని ఎమ్మెచేసాను. చైల్డ్ సైకాలజీలో పి హెచ్ డి చేస్తున్నాను. యింకా కొన్ని పేపర్లు మిగిలాయి.నేను స్వాతిని చక్కగా మలచగలిగితే నా పి హెచ్ డి సహజంగా పూర్తి చేసినట్లుగా భావిస్తాను. నా ప్రయత్నంలో పరిణామం ఎలా వున్నా బాధపడను.అయితే యింత చదువుకుని మీ అమ్మాయికి గవర్నెస్ గా రావడానికి నాకు చిన్నతనం లేదు. తప్పు లేని పని ఏదయినా గౌరవించతగ్గదే!మీ స్నేహితులు బంధువుల విషయం మీరెలా సాల్వు చేసుకుంటారో మీ యిష్టం. నా ఈ ప్రపోజల్ మీకు అంగీకారం అయితే రేపు ఫోను చెయ్యండి ఎల్లుండి ఉదయాన్నే డ్యూటీలో చేరుతాను". స్థిరమయిన స్వరంతో తెలిపింది.రామనాధంకి ఆమె సూటిగా మాట్లాడే పధ్దతి స్వయం నిర్ణయం చేసుకునే ధైర్యం చాలా ముచ్చటవేసింది."శుభకార్యానికి ఆలశ్యమెందుకు? ఈ రోజే మిమ్మల్ని మాయింటికి తీసుకు వెళ్లి స్వాతికి పరిచయం చేస్తాను. ఎప్పుడు మాయింటికి రావాలన్నది మీరు నిర్ణయించుకోండి నా తరఫునుంచి మీకు ఎటువంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురవదని హామీ యిస్తున్నాను"తలవంచుకుని ఆచెప్పే తీరులో అతని నిజాయితీ వెల్లడయింది. వెన్నెల కురిసినంత చల్లగా నవ్వింది సావిత్రి."నేను భయపడటం అన్నది మర్చిపొయాను.శేషజీవితాన్ని గూర్చి బంగారు కలలుకనే వయసు కాదు. మీ సంగతేమో గాని ఒక తల్లి లేనిపిల్లకి తల్లిగా నిలువగలిగితే నాజీవితానికి సార్థకత కలిగినట్లు భావిస్తాను".ఈమాటలు విన్న రామనాధం కళ్లు చెమర్చాయి."మీరు యింకొన్ని సంత్సరాల ముందు పరిచయమయితే బాగుండును, మా స్వాతి ప్రవర్తన మెరుగుపడెదేమో . చిన్నపిల్ల ఏమయినా మీ మనసు నొప్పించేలా మాట్లాడితే నేను క్షమాపణ కోరుకుంటాను". "తినబోతూ రుచులెందుకు? ఎక్కువ ఆలశ్యం కాకుండా వెళ్దాం పదండి".రామనాధం కారులో యింటికి తీసుకు వెళ్లేడు ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణంసావిత్రికి యింటిపరిస్థితిఅర్ధమయింది. నౌకరు స్వాతిని పాలు తాగమని బతిమాలుతున్నాడు. యిల్లంతా బొమ్మలు బట్టలు చిమ్మి వున్నాయి,అమ్మా! స్వాతీ ఎవరొచ్చారో చూడు"అన్నాడు రామనాధం ఎవరన్నట్లు తలేత్తి సావిత్రి వైపు చూసింది.సావిత్రి పలకరింపుగా నవ్వింది." ఆంటీ నీతో ఆడుకుందికి నీకు తోడుగా వుండటానికి మనింటికి వచ్చి వుంటారు నేను ఆఫీసుకి వెళ్లినాప్పుడు ఒక్కర్తివీ వుంటావుకదా నీకు ఏంకావాలన్నా చేసిపెడతారు" చాలా ఆలోచించి మాటలు కూడబెట్టి కూతుర్ని దగ్గరగాపట్టుకుని చెప్పాడు రామనాధం. కారులో యింటికి తీసుకెళ్లాడు. ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం సావిత్రికి యింటి పరిస్థితి అర్ధమయింది.నౌకరు స్వాతిని పాలు తాగమని బతిమాలుతున్నాడు. యిల్లంతాబొమ్మలు బట్టలు చిమ్మి వున్నాఅయి."అమ్మా! స్వాతీ ఎవరొచ్చారో చూడు" అన్నాడు రామనాధం,ఎవరన్నట్లు తలేత్తి చూసిందిసావిత్రి వైపు సావిత్రి పలకరింపుగా నవ్వింది."ఈ ఆంటీ నీకు తోడుగా వుండటానికి మనింటికి వస్తారు. నేను ఆఫీసుకెళ్లినప్పుడు నీతో ఆడుకుందికి నీకేంకావాలన్నా చేసి పెట్టడానికి నీ స్కూలు వర్కులో హెల్పు చెయ్యడానికి నీతో వుంటామన్నారు" ఆలోచించి మాటలుకూడబెట్టి కూతుర్నిదగ్గరగా పట్టుకుని చెప్పాడు రామనాధం. సావిత్రి మాటకలుపుతూ "నీ పేరు స్వాతికదూ నా పేరు సావిత్రి. నేను రెండు రోజుల తర్వాత వస్తాను నీకిష్టమైతే.నాకు రాని ఆటలు నువ్వు నేర్పించు నీకు రాని ఆటలు నేను నేర్పుతాను. నువ్వు స్కూలునుంచి వచ్చాక మనం మంచి ఫ్రెండ్సులాగ వుందాం. యింతకూ నీ రూము బొమ్మలు నాకు చూపిస్తావా"?" రండి ఆంటీ నా బొమ్మలన్నీ యిల్లంతాపడివున్నాయి నా రూములో కొద్దిగానే వున్నాయి". అంటూతీసుకెళ్లింది.రామనాధాన్ని అక్కడే వుండమని సౌంఙ్ఞ చేసి స్వాతి చేయి పట్టుకుని లోపలికి వెళ్లింది.రూములో స్వాతి తల్లి ఫోటొ రేకు మీద పెట్టి వుంది. తెలియనట్లు యిదెవరి ఫోటో? అడిగింది స్వాతిని "మీకు తెలియ్దు కదూ! మా అమ్మ ఫోటొ. మాఅ అమ్మకి జ్వరం వస్తే తగ్గ లేదని దేముడు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి రాజయ్యతాతే అన్నీ చేస్తాడు. నాన్నకి అస్సలు టైముండదు ఎప్పుడూ బేంకు బేంకు అంటారు నాతో మాట్లాడటాకే తీరికుండదు.". తల్లి గురించి తండ్రిగురించి చెప్పింది. "అలాగా నేను వస్తాను కదా మనం ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు ఆడుకోవచ్చు" అంటూ వాళ్లమ్మ ఫోటోని చేతిలో తీసుకుని తన కొంగుతో ఫోటో మీదవున్న దుమ్ముతుడిచి పెడుతూ స్వాతిని గమనించింది. ఆమె కళ్లల్లో ఒక విధమైన మెరుపు కన్పించింది."ఓ కే స్వాతీ నేను వచ్చాక నీబొమ్మలు బట్టలు అన్నీ చక్కగా సర్ది నిన్ను స్కూలుకి పంపుతాను నీతోనే వుంటాను. మరి నేనంటే యిష్టమేనా? వచ్చేదా?""రండి ఆంటీ నాకు మీరెంతో నచ్చారు" ఆమెని పట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకెళ్లి "నాన్నా యీ ఆంటీని తొందరగా మనింటికి రమ్మనండి మీరు బేంకునుంచి లేటుగా వచ్చినా నాకు ఆంటీ దగ్గర బాగుంటుంది" రామనాధం చాల రిలీఫ్ గా ఫీలయ్యాడు. "రండి మీ యింటివద్ద దింపుతాను"."వద్దు సార్! నేను బస్సులో వెళతాను ఎల్లుండి వస్తాను,నా బట్టలు సర్దుకుని తెచ్చుకోవాలికదా వస్తాను స్వాతీ" మొదటి రోజే తండ్రి తనకు యింపార్టెన్సు యివ్వడం స్వాతికి నచ్చకపోవచ్చని వూహించి బస్సులో వెళ్తానని చెప్పింది ."సరే ఆంటీ"స్వాతి ఎలా స్పందిస్తుందోనని భయపడ్డాడు కాని యింత తేలికగా ఒప్పుకుంటుందనుకోలేదు. తుడిచింది. సరే! ఆమె పరిస్తితుల్ని యెలా టేకిల్ చేస్తుందో వేచి చూడటం తప్ప చేయగలిగింది లేదు. స్వాతికి మనసులో తనమీదగాని పెళ్లిచేసుకోబోయే సావిత్రి మీదగాని దురభిప్రాయం కలుగకుండా చూడటం ముఖ్యమని భావించాడు.
సావిత్రి స్నేహితురాలితో వుంటోంది. ఆమెకి సెటిల్ చేసుకునే వ్యవహారాలు ఏమీ లేవు గాని రామనాధం అభిప్రాయం ఎలావుంటుందో స్వాతి ఎలా స్పందిస్తుందో గమనించడానికి ఆఒక్క రోజు వ్యవధి అడిగింది.రూము చేరి స్నేహితురాలు గిరిజతో జరిగినదంతా చెప్పింది. "ఏమయినా ఈ విషయంలో నువ్వు సాహసిస్తున్నావనిపిస్తోది సావిత్రీ ఆడదిక్కులేని ఆ యింట్లో ఆరునెలలునువ్వు గడపడం సమర్ధనీయంగా వుంటుందా?" " వెర్రిదానా మనం వుద్యోగాలకి వెళ్తున్నప్పుడు యింతకన్నా అర్ధ్వాన్నమయిన సంఘటలు ఎదుర్కొంటూ వుంటాం. అయినా వుద్యోగాలు మానం యిదికూడా ఒక వుద్యోగమే అనుకుని జాయిన్ అయితే ఆతరువాత ఏమవుతుందో చూడటమే అనుకూలంగా లేకపోతే అప్పుడే తప్పుకుంటాను" నీ యిష్టం సావిత్రీ నీ జీవితానికి నువ్వే బాటవేసుకోవాలి బెస్ట్ ఆఫ్ లక్"!"థేంక్స్ చాలా అలిసిపోయాను భోజనం చేసి నిద్రపోతాను"." ఓ కే".
స్వాతి ఆ రోజున్నరలో తండ్రిని సావిత్రి గురించి ఎన్నో మార్లు అడిగింది. ఆమె యింటికి వస్తే తనకి ఎలా వుంటుందో వూహించుకుంటూ గడిపింది. రామనాధం నౌకరు రాజయ్యతోను పనిమనిషితోను స్వాతిని చూసుకుందికి మనిషిని ఏర్పాటు చేసినట్లు ఆమె యింట్లో పాపతోనే వుంటుందని ముందుగానే చెప్పాడు. ఆమె వచ్చాక అపోహలు వుండకూడదని. చెప్పినట్లుగా సావిత్రి సింపుల్ గా ఒక సూట్ కేసుతో వచ్చింది.రామనాధం బేంకుకి వెళ్లేలోగా రావడంతో కొన్ని సామాన్లు ఎక్కడవున్నాయో చెప్పి ఆమె వుండటానికి ఏర్పాట్లు చూసి బేంకుకి వెళ్లాడు. ఏమయినా అవుసరమయితే ఫోను చెయ్యమని నంబరిచ్చి వెళ్లాడు. సావిత్రి విషయం ప్రాణస్నేహితుడైన మోహనరావుకి చెప్పాడు. అతను మిగతావన్నీ సమర్ధించినా డబ్బు దస్కం జాగ్రత్తగా పెట్టుకోమని విషయం తేలేదాకా ఎటువంటి యిబ్బందుల్లో పడకుండా చూసుకోమని హెచ్చరించాడు. అప్పుడప్పుడు యింటికి వచ్చి తనుకూడా గమనిస్తానని చెప్పాడు. సాయంత్రం యిల్లు చేరేసరికి స్వాతి చాలా సంతోషంగా ఎదురొచ్చింది. రోజంతా ఎలాగడిపిందో తండ్రికి వర్ణించి చెప్పింది. రామనాధం తేలికగా వూపిరి తీసుకున్నాడు. స్వాతితో మసలుకోవడం కష్టమనిపించలేదు. కాని తనతో ఎప్పటికి అతుక్కుని వున్నట్లయితే పెండ్లి తరువాత రామనాధంతో భార్యగా మసలుకోవడంలో యిబ్బంది అవుతుందని అది దృష్టిలో పెట్టుకుని స్వాతి చదువు ఆటలు మిగతా కార్యక్రమాలన్నిటికి టైమ్ టేబిల్ సిధ్దం చేసింది. రామనాధంతో చెప్పింది నలుగురికి వంట చెయ్యటానికి వంటమనిషి ఎందుకు తనే చేస్తానని.రామనాధం సున్నితంగా వారించి మిగిలిన సమయం మీచదువుథీసిస్ కోసం వినియోగొంచండి ఈ మేటరు ఎలావున్నా మీ చదువుకి భంగం కలుగకూడదు అని.అతని సంస్కారానికి మనసులోనే జోహార్లర్పించింది. ఆమె వచ్చిన తరువాత రోజులు సాఫీగా వేగంగా గడుస్తున్నాయి. ఒకరోజు స్వాతికి విపరీతంగా జ్వరం వచ్చింది డాక్టరుకి ఫోను చేసి పిలిపించింది,రాజయ్య చేత మందు తెప్పించి వేసింది. మంచం మీద కూర్చుని నుదుటి మీద తడి పట్టీ వేస్తూ సావిత్రి అడిగింది "మీ నాన్నగారికి ఫోను చేసి పిలవనా? స్వాతీ జ్వరంగా వుందికదా"."వద్దు ఆంటీ మీరున్నారుకదా నాన్న సాయంత్రం వచ్చేస్తారు నాకేం భయం లేదు" తనమీద పాపకున్న నమ్మకానికి కళ్లు చెమర్చాయి. అయినా పాపకి తెలియకుండా రామనాధంకి ఫోను చేసింది గాభరా పడవలసిన పనిలేదని ధైర్యం చెప్పింది. సాయంత్రం యింటికి వచ్చాక కూతురిమంచం వదలకుండా కబుర్లు చెప్తూ పండ్లు కోసి తినిపించాడు. మూడు రోజుల జ్వరం పాపని సావిత్రికి మరింత దగ్గర చేసింది. ఏమి కొనుక్కోవాలన్నా ఆంటీ స్కూలు వర్కు చెయ్యాలన్నా ఆంటీ ఏనాడేనా ఆమె పెండ్లి వద్దనుకుని వెళ్లిపోతే స్వాతి పరిస్తితి ఏమవుతుందని సందేహంలో పడ్డాడు రామనాధం. స్వాతీ నీ పనులు నువ్వు చేసుకోవడం అలవాటు చేసుకోమ్మా ఎప్పుడైనా ఆంటీ వేరే చోట వుద్యోగానికి వెళితే నీకు యిబ్బందవుతుంది. ఈ మాటలు విన్నాక స్వాతి ఆరోజంతా డల్ల్ గా అయి సరిగా భోజనం చెయ్యలేదు తనెక్కడికి వెళ్లటం లేదని నచ్చ చెప్పి పరిస్తితి సర్దుబాటు చేసింది సావిత్రి . ఒక రోజు రాత్రి నిద్రలో ఎవరో వాంతి చేసుకుంటున్న శబ్దవిని సావిత్రి హడావిడిగా లేచింది రామనాధం గదిలోంచి వినిపిస్తోంది.రాజయ్యని లేపి అతనికి సహాయం చేయించింది.డాక్టరుని పిలిపించింది. బయట డిన్నరు తీసుకోవడం వలన పడక అలా అయిందని డాక్టరు మందిచ్చి ఒక రోజు రెస్టు తీసుకోమన్నాడు. మర్నాడు లైట్ గా వంట చేసిపెట్టి మందులు గుర్తుగా వేసింది.ఇది చూశాక స్వాతి గాభరా పడి "ఆంటీ మీరెప్పటికి మాతోనే వుండండి నాన్నకేమయినా అయితే నేనెలా చూసుకోగలను? రాజయ్యతాత ముసిలైపోయాడు రాత్రి లేవడు" అంటూంటే వుండాలనే వచ్చానమ్మా కాని ఆ బంధంఏర్పడటానికి నీ సహాయం కావాలి మనసులోనే అనుకుంది.
ఒక రోజు పెట్టెలో బట్టలు సర్దుతూంటే స్వాతి కుతూహలంగా పక్కనకూర్చుని "ఆంటీ యిప్పుడు పెట్టెందుకు సర్దుతున్నారు?" "ఏం లేదమ్మా అన్నీ నలిగి అటూ యిటూ పడి వుంటే సర్దుతున్నాను". ఆమె చీరలు చూసి "ఆంటీ మీకు మంచి చీరలు మెరిసేవి లేవా?"నాకెలా 'వస్తాయమ్మా? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న యిద్దరూ దేముడి దగ్గరకెళ్లిపోయారు. మా మామయ్య నన్ను పెంచారు. మంచి బట్టలు కొనడానికి అతని దగ్గర అంత డబ్బు లేదు. అందుకనే నేను బాగా చదువుకుని మంచి వుద్యోగంచేసి అప్పుడు మంచి చీరలు కొనుక్కుంటాను"."అయ్యో! పోనీ అమ్మ చీరలు బీరువాలో వున్నాయి కట్టుకోండి ఆంటీ" "తప్పమ్మా అలా ఎవరు పడితే వాళ్లు అమ్మ చీరలు కట్టుకోకూడదు. నువ్వు పెద్దయ్యాక అమ్మ మంచి మంచి చీరలు కట్టుకుందువుగాని సరేనా?పద నీకు తల దువ్వుతాను ఆడుకుందువుగాని" . రామనాధం వచ్చాక యీ సంఘటన తండ్రికి చెప్పింది. "అమ్మ చీరలు ఆంటీ కట్టుకోకూడదా నాన్నా?"అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అదే సందర్భంలో మోహనరావు ప్రవేశించి "ఏమిటి తండ్రీ కూతుర్లు చిక్కు సమస్యలో యిరుక్కున్నారు?" ప్రశ్నించాడు. అదే ప్రశ్నని తిరిగి మోహనరావుని ప్రశ్నించింది.కాసేపు తటపటాయించి "ఆంటీకి యిష్టమయితేకట్టుకోవచ్చనుకో కాని మనింట్లో రాజయ్యతాత పనిమనిషి సీతాలు పాలుపోసే రంగయ్య అందరూ ఆంటీని మీ అమ్మ అనుకుంటారు.అప్పుడెలాగ?" "అలా అనుకోకూడదా అంకల్?""అనుకోవచ్చనుకో నువ్వు అనుకోకపోతే ఆంటీకి బాధగా అనిపిస్తుంది. అప్పుడు వేరే చోటికి వెళిపోతుంది. ఇందులో యింత చిక్కుంది" కాఫీ చేసి పట్టుకొస్తున్న సావిత్రి గాభరా పడింది.ఈ మాటలకి స్వాతి ఎలా స్పందిస్తుందోనని.రాత్రి ఏమీ మాట్లాడకుండా గుడ్ నైట్ చెప్పకుండా పడుక్కుంది.సావిత్రికి ఏం చెయ్యాలో తోచలేదు. ఉదయం రామనాధం వద్దకెళ్లి "నాన్నా ఆంటీ మనింటినుంచి వెళ్లకూడదు. అలా చెయ్యాలంటే మనమేం చెయ్యాలి?" నిర్ఘాంతపోయాడు కూతురి మాటలకి."ఆంటీనడుగమ్మా మనతోనే వుండటానికి ఆమెకి యిష్టమో కాదో" సందిగ్ధంగా అన్నాడు."ఆంటీకి నేనంటే చాలా యిష్టం నన్నొదిలి అస్సలు వెళ్లదు.మీరు చెప్పండి నాన్నా". సరే నేను బేంకునుంచి వచ్చాక చెప్తాను నువ్వు స్కూలికి వెళ్లు"అన్నాడు. ఆ చిన్ని బుర్రకి ఈ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియలేదు. రాజయ్యతాత వద్దకెళ్లి తన సమస్యని అతని ముందుంచింది."ఓస్ యింతేనా మీ నాన్న గారు సావిత్రమ్మని పెళ్లి చేసుకుంటే ఆమె ఎక్కడికీ పోకుండా మీతోనే వుండిపోతారు".తనకున్న తెలివితేటలు బయట పెట్టేడు. ఇదేదో బాగుందని సాయంత్రం తండ్రి రాగానే పెద్ద తరహాగా చెప్పింది,"నాన్నా ఆంటీ మనతోనే వుండిపోవాలంటే నేను చెప్పినట్లు చెయ్యండి". "ఏం చెయ్యాలమ్మా?"గాడ్ ప్రామిస్"" ఎస్స్ గాడ్ ప్రామిస్""ఆంటీని మీరు పెళ్లి చేసుకుంటే ఆంటీ ఎక్కడికీ వెళ్లదు".అవాక్కయిపోయాడు స్వాతి కన్న కూతురా కన్న తల్లా అనుకున్నాడు. "ఎవరు చెప్పారమ్మా?" "మిమ్మల్నడిగితే సాయంత్రం చెప్తానన్నారు. అంతవరకు ఆగలేక రాజయ్యతాతనడిగాను. నాకు యిష్టమే అందుకని మీకు చెప్పాను". కాసేపు నోట మాట రాలేదు."నాన్నా మాట్లాడరేం?""అమ్మా! ఆంటీని అడుగు అంతేకాని మనమే అలా చెయ్యాలి యిలా చెయ్యాలి అనుకోకూడదు. ఆంటీకి మనింట్లో వుండిపోవడం యిష్టమో కాదో"లోపలి గదిలోనున్న సావిత్రివద్దకు పరుగెత్తుకెళ్లి "ఆంటీ ఒక సారి రండి"అంటూ చెయ్యి పట్టుకుని తండ్రి వద్దకు తీసుకు వచ్చింది." ఏమయింది స్వాతీ?"అంటున్నా వినిపించుకోకుండా"ఆంటీ యిప్పుడు చెప్పండి మీకు మాయింట్లో వుండిపోవడంయిష్టమేనా?"వెనుకజరిగిన విషయాలేమీ తెలియక వెంటనే "నాకయితే ఎప్పటికీ నీతోనే వుండటం యిష్టం స్వాతీ"అంటూ దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టింది. "చూశారా నాన్నా ఆంటీకి యిష్టమే మీరేమంటారు?"రామనాధంకి భగవంతుడే బిడ్డ రూపంలొ సంధానకర్త అయినట్లనిపించింది.సావిత్రి తేరుకుని "యింతకూ ఎందుకింతలా అడుగుతున్నావు?నేను వెళ్లిపోతానని అనలేదే?" "నాకే భయం ఆంటీ మీరెప్పుడైనా వెళ్లిపోతే నేనెలా వుండాలి? అందుకని నాన్నతో చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే యిక్కడే వుండిపోతారని""స్వాతీ ఎవరు చెప్పారమ్మా నీకివన్నీ" "రాజయ్యతాత" సరే యివి ఒక రోజులో చేసే పనులు కావమ్మా నేనెక్కడికీ వెళ్లనుగాని మోహనరావు అంకల్ నికూడా అడుగుదాం సరేనా?" సరేనని లోపలికెళ్లి మోహనరావు నంబరు డయల్ చేసి" అంకల్ మా యింటికి వస్తారా?""నిన్ననే కదమ్మా వచ్చాను పనేమిటో చెప్పు" "అంకల్ నాన్నకి ఆంటీకి పెళ్లి చెయ్యాలి మీరు వేగం రండి" మోహనరావు నోట మాట రాలేదు."యిప్పుడే వస్తున్నా స్వాతీ" అంటూ ఫోను పెట్టీసేడు.అయిదు నిమూషాల్లో రామనాధం ముందు నిలబడ్డాడు."ఏమిటిది స్వాతి ఫోను చేసి పిలిచిందినీకూ సావిత్రికి పెళ్లి చెయ్యాలని.నాకేమీ అర్ధం కాలేదు"."ముందు కూర్చో".ముందురోజు జరిగిన తతంగం కొంత మోహనరావుకి తెలుసు తరువాత జరిగినది పూర్తిగా వివరించాడు."సరే రోగీ పాలే కోరాడు వైద్యుడు పాలే తాగమన్నట్లయింది" "నాకేం పాలుపోవటం లేదు.మిగతా కార్యక్రమంనువ్వు చూడు స్వాతిని ఎలా టేకిల్ చెయ్యాలో తికమకగా వుంది"."అమ్మా స్వాతీ! యిలారా నువ్వు చెప్పినట్లు పెళ్లి చేసేద్దాం. కాని నువ్వు టి వి లో సినిమాలో చూసినట్లు కాదు. వీళ్లిద్దరూ మేరేజ్ ఆఫీసుకెళ్లి సంతకాలు పెట్టాలి అప్పుడు మీ అమ్మకూడా యీ పెళ్లి ఒప్పుకున్నట్లు ఆ తరువాత బేంకువాళ్లకి చెప్పాలి వుత్తినే చెపితే బాగుండదు కదా.చిన్న పార్టీ యిచ్చి వీళ్లిద్దరికీ మనం పెళ్లి చేసినట్లు చెబ్దాం సరేనా? ఏమంటావ్?"చప్పట్లు కొడుతూ "చాలా బాగుంది అంకల్ అలాగే చేద్దాం. నేను చిన్నదాన్నికదా మీరు యివన్నీ చెయ్యండి అంకల్". రామనాధంతోపాటు సావిత్రికూడా శాంతపడింది. ఈ విషయం యింత సింపుల్ గా సాల్వ్ అయినందుకు. శనివారం వుదయం రిజిష్టారాఫీసులో పెళ్లి సాయంత్రం పార్టీ. పార్టీకి వచ్చిన బేంకు స్టాఫులో వయసుమళ్లినశేషాచలంగారు ఆశీర్వదిస్తూ మీరు ద్వితీయ వివాహం చేసుకుని చాలా మంచిపని చేశారు .మీ పాపని చూసుకుందికి మంచి అమ్మాయి లభించింది. కంగ్రాట్యులేషన్స్! అంటూంటె పక్కనే వున్న మోహనరావు అయ్యా యిది ద్వితీయం కాదు అద్వితీయం అనగానే అక్కడ వున్నవాళ్లంతా ఘొల్లున నవ్వారు.