16 January, 2022

అమ్మ

 ఈ కధ బహుశ 70's లో ఏ మేగజైన్లో చదివానో, రచన ఎవరిదోగుర్తు లేదు.కాని కధా వస్తువు మాత్రం మనసులో చెరగని ముద్రె పడింది.

యిప్పటికి బాగా గుర్తు, చదివిన ప్రతీ సారి మనసు ఆర్ద్రమై కనులు చెమర్చటం జరిగినది. అది నా బలహీనతకావచ్చు. అదే కధని నేటి పరిస్థితులకనుగుణంగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి నాదైన శైలిలో మీ ముందుంచుతున్నాను.ఆదరిస్తారని భావిస్తున్నాను.

                                                అమ్మ

శేషగిరి స్కూలు టీచరు. లెఖలు ఇంగ్లీషు బోధించేవారు.భార్య మాణిక్యమ్మ, వీరికి మాధవి, శశాంక్ యిద్దరు పిల్లలు.
అందరు టీచర్ల వలెనే సాధారణ జీవితం సాగిస్తూ పిల్లల్ని క్రమ శిక్షణలో పెంచారు .మాధవి గ్రాడ్యుఏషను అవగానే ఇ న్ కం టేక్సుశాఖలో అధికారిగా వున్న శ్రీరాం కి యిచ్చి వివాహం చేశారు. అబ్బాయి సి ఎ అవగానే కాకినాడలో వుద్యోగం వచ్చింది.తన సెర్వీసులో వుండగా యిల్లు కూర్చుకోలేక పోయానన్నచింత వుండేను.
అబ్బాయికి 25 సంత్సరాలు నిండగానే స్నేహితుడు విద్యాధర్ కుమార్తె సుశీలనిచ్చి వివాహం జరిపించేశాడు.
"ఇంత హడావిడేమిటిరా? అబ్బాయిని కాస్త వుద్యోగంలో నిలదొక్కుకోనీకుండా"అని కాబోయే వియ్యంకుడితో చెప్తున్నా,"లాభం లేదు ఆలశ్యం చేస్తే ఈ చేప యింకే కొక్కేనికి తగులుకుంటుందో ,శుభశ్య శీఘ్రం."
పెళ్ళైన ఏడాదికి మనుమడు పుట్టగానే స్నేహితుడు హాస్యమాడేడు."తాతగారి హడావిడి మనుమడికి కూడా వచ్చేసినట్లుంది."
కిట్టూ పుట్టగానే శేషగిరి వాలెంటరీ రిటైర్మెంటు బెనిఫ్ట్త్సు దొరొకుతున్నాయని రిట్తైర్మెంటు తీసుకున్నారు.వచ్చిన డబ్బు, కొడుకు లోను పెట్టిన డబ్బుతో మూడు గదుల యిల్లు కొన్నారు. అంతా కలిసి కాకినాడలో కాపురం పెట్టారు.సుశీల వచ్చిన నాటినుంచి శేషగిరి గారి కుటుంబంతో పాలు నీళ్ళలా కలిసిపోయింది.అత్తా కోడళ్ళిద్దరూ కలిసి మెలిసి పనులు చేసుకునేవారు.
శేషగిరిగారు వుద్యోగంలో వుండగా ట్యూషన్లు చెప్పే వారు కాదు.రిటైర్మెంటు తరువత ఉదయం రెండు బేచిలలో పదేసి మంది పిల్లలు లెక్ఖలు ఇంగ్లిషుచెప్పించుకునేవారు.సాయంత్రం రెండు బేచిలువచ్చేవారు.వాళ్ళంతా వీధి అరుగు మీదకూర్చుని చదువుకునే వారు.మిగతా సమయంలో బజారు పని వుంటే యింట్లో భార్యని కోడల్ని అడిగి ఏం కావాలో తెచ్చేవారు.
కిట్టూ రెండేళ్ళవాడయాడు,వాడితో ఆట పాటలు ముద్దుమాటలు జీవితం సాఫీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో అందరికీ లెక్ఖల్లో తప్పులు దిద్దే మాస్టారి జీవితంలో పెద్ద తప్పు లెక్ఖ చేయించేశాడు భగవంతుడు. తుఫాను వచ్చి అల్లకల్లోలం అయిపోయినట్లయింది.
ఒక రోజొ ఉదయం టిఫిను చేద్దామని ఉప్మా కలియబ్ర్డుతోందిమాణిక్యమ్మ,ఒక్కసారి కళ్ళు తిరుగుతున్నట్ట్లైతే కోడల్ని కేకేసి"అమ్మా!సుశీలా నాకేమిటొ కళ్ళు తిరుగుతున్నాయి యీ ఉప్మా సంగతిచూడు కాసేపు కూర్చుంటాను".
అనగానే కంగారుగా పొయ్యి ఆర్పేసి అత్తగారి చెయ్యిపట్టుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టిందీ.
"నాకేం కాదు టిఫిను సంగతి చూడు శశాంక్ కి లేటవుతుంది".
పొయ్యి వెలిగించి ఉప్మా సంగతి చూస్తోంది,బాథ్రూంలోంచి "ఓక్!"శబ్దం రాగానే పొయ్యి ఆర్పేసి పరుగెత్తింది శశాంక్ హాల్లోంచి పరుగెత్తుకొచ్చాడు.
తల్లికి ఎప్పుడూ లేనిదివాంతి చేసుకుంటోందని యిద్దరూ పట్టుకుని ముఖం కడిగి నీళ్ళు పట్టి పడుకో బెట్టారు.
"సుశీలా అమ్మని డాక్టరుకి చూపించు అశ్రద్ధ చెయ్యకు నాకు ఆఫీసులో అర్జంటు పని ఉంది.వెళ్ళాలి."
"అలాగే అప్పాయింట్మెంట్ తీసుకుంటాను గంటలో తీసుకెల్తాను, మీరేం వర్రీ అవకండి"
"ఈ పూట ఒక బేచి పిల్లలకి శలవు యిచ్చేయండి మామయ్యగారూ , అత్తయ్యకి ఒంట్లో బాగు లేదు వాంతి చేసుకున్నారు."
"రాత్రి తిన్నది అరిగి వుండదు కాస్త జీలకర్ర కషాయం కాచి యిస్తే సర్దుకుంటుంది".
"అలాగే లెండి డాక్టరుకి చూపించి వచ్చాక కషాయం చేస్తాను.మీరూ వస్తే కిట్టూని చూసుకోవచ్చు."
"సరే రిక్షా తెస్తాను బయలుదేరుదాం నేను సైకిలు మీద వస్తాను".
డాక్టరు బి పి చూసి బి పి నార్మల్ గా వుంది బల్ల మీద పడుక్కోమని కడుపు నొక్కి చూసి అజీర్ణం సంబంఢించి ఏమీ కనిపించటం లేదు,ఆమె సుశీలని చూసిన గైనకాలజిస్టు కూడా ,మాణిక్యమ్మ కడుపు నొక్కి నొక్కి చూసి మీకు బహిష్టులు ఆగి [పోయాయా?"
ఆ!ఆగిపోయాయి."
"ఎన్నాళ్ళయింది?"
"ఒక సంవత్సరం ఔతోందనుకుంటాను." యూరిన్ శాంపిల్ తీ సి టెస్టు చేసింది.
రిసల్టు పోజిటివ్ సుశీలని లోపలికి పిలిచి "మీ అత్త గారికి సోనోగ్రాఫీ చెయ్యాలి."
"ఎందుకు డాక్టర్?"
"జస్ట్ ఫర్ కంఫర్మేషన్"
"మీ అత్తగారికి నాలుగు నెలల ప్రెగ్నెన్సీ ఆమె వయసు ఎంత?"
సంభాషణ వినగానే మణిక్యమ్మ "యిదేం విడ్డూరం డాక్ట? సరిగ్గా పరీక్షించారా?"
"సోనోగ్రాఫీలో డౌటేం వుండదమ్మా మీకేమాత్రం తెలియలేదా?" "అబార్షన్ చేసేయండి, యీ వయసులో మమ్మల్ని చూసి నలుగురూ నవ్వుతారు డాక్టర్!".
"పెద్ద ప్రాణానికే ప్రమాదం ,ఆ రిస్కు ఏ డాక్టరూ తీసుకోదు. ఒక్క సారి మీ మామగారిని పిలువు అతనితో కూడా మాట్లాడాలి."
శేషగిరి లోపలికి వచ్చిడాక్టరు నోటివెంట వచినవార్త విని అతనికి నోట మాటలేదు."
"డాక్టర్ దీనికేం సొల్యూషను లేదా?"
"నాకు తెలిసినంతవరకు డెలివరీ వరకు కేర్ తీసుకోవడమే!"
తల ఎక్కడ పెట్టుకోవాలో తోచలేదు శేషగిరికి. డాక్టరు మందుల చీటీ రాసిచ్చి జాగ్రత్తలు చెప్పారు "అమ్మా మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు,మీకు యీ బిడ్డని సాకే ఋణం వుంది, అంతకు మించి చెప్పడానికేం లేదు. సుశీలా! మీ యింటిల్లి పాది దృష్టి ఆమె ఆరొగ్యం కోసం చూడటమే . నీకు చంటి బిడ్డ వున్నాడు కావాలంటే ఎవరినైనా పని మనిషిని చూసుకో నీకు కొంత శ్రమ తగ్గుతుంది.ఆమెకి రెస్టు వుండేలా చూడు.శేషగిరిగారూ మనుమల్ని ఎత్తుకునే వయసులో మీకు బిడ్డ కలగడం చిన్నతనంగా భావించవద్దు.ప్రశాంతంగా వుండడానికి ప్రయత్నించండి."
యిల్లు చేరుకున్నాక పనులన్నీ యాంత్రికంగా చేసింది సుశీల.
శశాంక్ యిల్లు చేరేసరికి ఏడు గంటలు దాటింది.
"స్నానం చెయ్యండి భోజనం చేద్దురుగాని."
"సరే" అంటూ బాత్రూములో దూరాడు.స్నానం చేస్తూ గురుకొచ్చింది,ఉదయం అమ్మవొంట్లో బాగులేదని డాక్టరుకి చూపించిందా? అనుకుంటూ భోజనానికి కూర్చుని సుశీలని అడిగాదు."అమ్మని డాక్టరుకి చూపించావా ఏమన్నారు?"
"నాకు బుల్లి మరిదినో మరదలినోయివ్వబోతున్నారని చెప్పారు."
"ఏయ్! నీకు బుద్ధుందా?అమ్మతో యీ వయసులో పరాచికాలాడటం బాగుందా?"
"యిది మరీ బాగుంది డాక్టరు ఏది చెప్పారో అదే నేను రిపీట్ చేశాను." ఆంటె కంచంలో చెయ్యి కడిగేసికుని చివ్వునలేచి బెడ్రూములోకెళ్ళి పడుకుండిపోయాడు ఎంత సర్ది చెప్పుకున్నా ఈ విషయం జీర్ణం కావటంలేదు. ఆఫీసులో తెలిస్తే ఏమనుకుంటారు? యిరుగు పొరుగు వారేమనుకుంటారు బంధు వర్గంలో మన పరువేం కావాలి యివే శశాంక్శ మనసుని దొలిచేస్తున్నాయి.
పరిస్థితులను అర్ధం చేసుకుని సుశీలా శేషగిరిగారే అన్నీ సర్దుబాటు చేసుకున్నారు, సాధ్యమైనంత వరకు శశాంక్ కళ్ళముందు పడకుండా జాగర్త పడేవారు తల్లి తండ్రి.
ముందు జాగ్రత్తగా ఆడబిడ్డ మాధవికి విషయం తెలియజేసి ప్రసవం సమయానికి సహాయంగా రమ్మంది సుశీల.
మాధవి అత్తగారు "అవ్వ!"అని బుగ్గలు నొక్కు కున్నారు. "మరీ అంతగా నొక్కుకోకండి అత్తయ్యా! బూరె బుగ్గల కాస్తా సొట్ట బుగ్గలు అయే ప్రమాదం వుంది". అని హాస్యమాడింది.
ఒకానొక శుభదినాన మాణిక్యమ్మ హాస్పిటల్లో మగ బిడ్డని ప్రసవించింది.దాక్టరు ముందునుంచే అన్ని జాగర్తలు తీసుకున్నారు, మళ్ళీ గర్భం రాకుండా ట్యూబెక్టమీ చేశారు. వారం తరు వాత యింటికి తీసుకెళ్ళారు.శశాంక్ ఒక్క సారి కూడా చూడటానికి హాస్పిటల్కి రాలేదు.
మరునాడు పదకొండు రోజుల స్నానం,మాధవి తండ్రిని అడిగింది, "నాన్నా బాలసార సంగతి ఏం చేశారు?"
"యిప్పుడవన్నీ ఆలోచించ లేదు,అందరి మనసులు కుదుట పడ్డాక ఏదో వొక పేరుతో పిలుచుకుందాం."
పదకొండో రోజున తెల్లవారు ఝామున తల్లీ బిడ్డలికి స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేశారు. చంటి వాడికి పాలిస్తూ రామా లాలీ మేఘ శ్యామా లాలీ" అంటూ చిన్నగా పాడుకుంటోంది మాణిక్యమ్మ. శశాంక్ పెరట్లోకి వెళ్తూ వెనుక గది నుంచి తల్లి చిన్నగా పాడుతున్న పాట చెవిలో పడింది.
తనకి బాగా జ్ఞానం వచ్చే వరకు తల్లి వొళ్ళో తల పెట్టుకుంటే తన జుత్తు నెమ్మదిగా నిమురుతూ యీ లాలి పాట పాడుతుంటే కళ్ళు బరువెక్కి నిద్రపోయేవాడు.
హఠాత్తుగా అనిపించింది,ఆ పసివాడు చేసిన తప్పిదం ఏమిటి? తను అమ్మ నాన్నతో యీ చంటివాడితో దూరంగా మసలడానికి కారణం సమాజమా? తను ఎంత తప్పు చేశాడు,తల్లిని జాగ్రత్తగా చూసుకోవలసిన సమయంలో పరాయ వ్యక్తిలా మసలుకున్నాడు. అంతే! అనుకోకుండా అడుగులు తల్లి వున్న గదివైపు పడ్డాయి.
వొళ్ళంతా పసుపు రాసుకుని రూపాయి కాసంతబొట్టు పెట్టుకున్న అమ్మని చూడగానే ఒక్క సారిగా దుఖం పెల్లుబికి వచ్చింది. కొన్ని సంత్సరాల క్రితం అమ్మ వొళ్ళో తను అమ్మ ప్రేమ అనే అమృతాన్ని గ్రోలుతూ, యీ భావన మనసులోకి రాగానే "అమ్మా!"అన్నాడు."దా కన్నా అంటూ చేయి చాచింది మాణిక్యమ్మ.
యిన్ని నెలల దూరం వొక్క సారి మటు మాయం అయింది.అమ్మ పక్కనే కూర్చుని చంటి వాడిని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు, "నన్ను క్షమించమ్మా ఎంత మూర్ఖంగా ఆలోచించాను ఎంత అవివేకంగా ప్రవర్తించాను" అంటూ తల్లి భుజం మీద తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.
"వూరుకో కన్నా నీ తప్పేం లేదు నీ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు."
మాటలు విని సుశీల మాధవి శేషగిరి అందరూ పురుటి గది చేరుకున్నారు. "అమ్మా నువ్వూ నాన్న వీడిని గురించి ఏమీ చింత పడకండి వీడు నాకే తమ్ముడు కాదు మన కిట్టూగాడికి కూడా తమ్ముడే!ఏ ప్రయోజనం కోసం మనింట్లో పూట్టాడో వీడి మంచి చెడ్డలు నేను సుశీలా చూసుకుంటాం". పై మాటలు విన్నాక అక్కడున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.
వెంటనే మాధవి సుశీల మాణిక్యమ్మని చుట్టుకున్నారు.కోడలి తల నిమురుతూ
" అమ్మా సుశీలా యిన్ని రోజులు నువ్వు నాకు కోడలివి కాదు కన్న తల్లిలాగ చూసుకున్నావు, అమ్మ ఏ యుగంలోనైనా అమ్మ అమ్మే!"

03 October, 2021

 

నేస్తం

 

నా హైదరాబాద్ ట్రిప్పు వారం పూర్తి అయింది . ఆ రాత్రికే బొంబాయి వెళ్ళడానికి దొరంతోకి రిజర్వ్చేయించుకున్నాను.రాత్రి పదకొండు దాటాకే ట్రైను.మా మరిది వచ్చి, స్టేషనుకి దిగబెట్టేడు.  అప్పటికి ఇ కా తొమ్మిదయింది.తనని ఇంటికి వెళ్ళిపోమన్నాను.

ట్రైన్ టైమిం గ్ చూ సుకుంటున్నాను ,నా పక్కనే నేసం అన్న్ పిలుపు వినిపించింది. ఈలొగా   నా ట్రైను రెం డు గంటలు లే టుగా బయలుదేరు "తుందని అనౌన్స్మెంటు వినిపించింది.

నేస్తం గుర్తు పట్టలేదా> నేను స్వర్నలతని అదే మా ఇంట్లో రాణి అని పిలిచేవారు, హిరమండలం మర్చిపోయావా నేస్తం?"

 "ఆ! ఆ! గుర్తొచ్చింది మీ నాన్నగారు గురుమూర్తిగారు,ఇరిగేషను డిపార్ట్మెంటులో పనిచేసేవారు. మీ అమ్మగారు ,మీ నాయనమ్మగరు వుండేవారు."

అనగానే నా రెండు చేతులు పట్టుకుని "ఎన్ని సంవత్సరాలయింది నేస్తం మళ్ళీ నిన్ను చూడగలననుకోలేదు." కళ్ళలోసన్నటి నీటి పొర.నిజమే ఇలా కలుసుకోవడం యాధృచ్చికమే,నువ్వెటు ప్రయాణం?"

"రాజమండ్రి ఇక్కడ మా ఆడబిడ్డ గృహ ప్రవేశానికి  వచ్చేను.పనైపోయింది వెళ్తున్నాను. నా ట్రైనుకి గంటపైనే సమయం వుంది. తన రెండు చేతులు పట్టుకుని "నేస్తం! అమ్మ నాన్నగారు నాయనమ్మ ఎలా వున్నారు?"

ప్రశ్న పూర్తికాకుండానే బల్లిలా నన్ను కరుచుకుని "అందరూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు?అవాక్కయాను."అదెలా ? ఎప్పుడు?" తన రెడు కళ్ళూ జలపాతాల్లా వర్షిస్తున్నాయి  "నేస్తం శాంతపడు నీ రైలుకి టైముంది . బెంచ్ మీద కూర్చుని వివరంగా మాట్లాడుకుందామ్న్ పద." అంటూ బెంచ్ మీద కూర్చోపెట్టి నీళ్ళ బాటిలు యిచ్చాను"కాస్త తాగి మొఖం కడుక్కుని తెప్పరిల్లు."

కాస్త శాంతపడి"మీరు ఆవూరినించి వెళ్ళి పోయాక ఇంకెవరూనాకు స్నేతురాళ్ళు దొరకలేదు.అలా అనేకన్నా నేనే ఎవరితో స్నేహం చేయలేదు.పదవ తరగతికి వచ్చాను,రెండు నెలలు గడిచాయో లేదో నాన్నగారికి హార్త్ అట్టాక్ వచ్చింది, హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే సమయం కూడా యివ్వ లేదు,వెళ్ళిపొయేరు.

 మా ముగ్గుకి లోకం అంతా చీకటీయినట్లయింది.మామయ్య వచ్చి అండగా నిలబడ్డాడు.నాన్న తరఫున నాయనమ్మ తప్ప యింకెవరూ లేరు.ఆఫీసువాళ్ళు స్నేహితులే చూసుకున్నారు.అమ్మని పట్టుకుని మామయ్య గోల పెట్టేడు,"బావగారు పిల్ల కోసం ఎమీ నిర్వాకం చెయ్యలేదు యిల్లు గాని జాగాలు గాని ఏమీ కూర్చుకోలేదు.యీపిల్లని ఎలా ఒడ్డు చేరుస్తాం అక్కా?" అంటూ ఏడ్చాడు.

 అమ్మ నిశ్శబ్దం అయిపోయింది ఏడవదు మాట్లాడదు" .

రాణి మనసులోని బాధనంతా చెప్పుకోనిచ్చాని.

"రెండు నెలలు గడిచాయి నాయనమ్మ కూడా నాన్న దారే పట్టుకుంది.

మామయ్య మళ్ళీ వచ్చాదు,"యిక లాబం లేదు,రాణి పదో తరగాతి పరీక్షలవగానే మా యిద్దరినీ రాజమండ్రి తీసుకెళిపోతాను అందరం ఒక్కచోటే వుందాం అన్నాడు. మీ యిద్దరికి యింత పెద్ద మేద ఎందుకు అంటూ ఒక గది వంటిల్లు వున్న యిల్లు చూశాడు.అఖరలెని సామాన్లన్నీ  అమ్మేశాడు నా పరీక్షలైన ఉత్తర క్షణం మమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్ళిపోయాడు. నాకున్న నగలలో ఏవి కావాలో వుంచి ,నాయనమ్మనగలు అమ్మ నగలు అన్నీ అమ్మేసి ఫిక్సిడ్ డిపాజిట్లు చేశాడు.దేనికీ అమ్మ అడ్డు చెప్పలేదు.

నన్ను ఇంటర్లో జాయిన్ చేశాడు.కాలేజి ఇంటికి దగ్గరే.    అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను.ఇంటరు మొదటి సంవత్సరం పూర్తయింది.రెండో సంవత్సరం లోకి అడుగు పెట్టాను.ఎప్పుడూ నాన్నే కళ్ళలో మెదిలేవారు.  ఒకరోజు కాలేజి నుంచి వచ్చే సరికి అమ్మ  ఏ సింటంస్ లేకుండా చెయ్యి జారి పోయింది.మా అత్త చాలా మంచిది.నన్ను పట్టుకుని అమ్మ కన్న ఎక్కువగా ఓదార్చింది.భగవంతుడు నా మీద పగ తీర్చుకుంటున్నాడులా వుంది.యింత ఘోరంగా ఎవరి జీవితం లోనైనా జరిగిందా?"

రెండు చేతుల మధ్య  ముఖం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది .

"నేస్తం ధైర్యం తెచ్చుకో యింకేమయిందో చెప్పు." ఊపిరి గట్టిగా పీల్చుకొని చెప్పడం మొదలు పెట్టింది."ఇంటరు పూర్తవగానే మామయ్య ఒక సంబంధం తెచ్చాడు.అబ్బాయిది రాజమండ్రియే,తండ్రి అతని నాలుగో ఏట పోయారుట తల్లి గత సంవత్సరమే పోయారుట.ఒక అక్క యిక్కడ వున్నామె. అతని జాతకం కూడా నా లాగే వుంది.  "పెళ్ళికి తొందరేముంది మామయ్యా డిగ్రీ చదివి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. అతనెటువంటి వాడో  నేను అద్జస్ట్ అవగలనా?" అంటూ సందేహం బయట పెట్టాను."చూడు రాణీ! నువ్వు చెప్పినవన్నీ జరగాలంటే నేను అంత వరకు వుంటానన్నభరోసా ఏముంది ఏది ఏమైనా ?తొందరగా పనులు ముగించుకోవాలి."

నేను ఏమీ మాట్లాడలేదు మా పెళ్ళి నిరాడమరంగా జరిగిపోయింది.అబ్బాయి పేరు వెంకట రమణమూర్తి కాస్త అమాయకంగా వుంటాడు"మరి ఉద్యోగం ఏమైనా చేస్తున్నాడా అదీ లేదా?ఆతృతగా అడిగాను.

"చేస్తున్నాడమ్మా మధ్య మధ్యలో బ్రేకువుంటుంది."

"అలాంటప్పుడు భుక్తి ఎలా?"

 

"అరే! చింత పడకు అతనికి తాతల నాటి యిల్లు వుంది,క్రింది వాటాలో మేము వుంటే పై వాటా బేంకువాళ్ళకి అద్దెకు యిచ్చాము, మొదటి తారీకు వచ్చేసరికి పదివేల రూపాయలుచేతిలో పెడతారు. అది చాలు బ్రతకడానికి."

అంతా విన్నాక "యింక నీకేం యిబ్బంది నేస్తం?బాగానే వుందిగా."

"అయ్యో అతనికి ఫ్యూచరు ప్లాను లేదు,మాటా మంతీ లేదు అన్నింటికి నిరాసక్తత.అటువంటి వ్యక్తితో పది సంవత్సరాలై నెట్టుకొస్తున్నాను.నేను చిన్నా చితకా వుద్యోగానికి ప్రయత్నిస్తానంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళి వుద్యోగం చెయ్యడం నచ్చదంటాడు.నేనెలా పెరిగానో నీకు తెలుసు కదా.మంచి సలహాయివ్వడానికి కూడా ఎవ్వరూ మిగల లేదు." అంటూ బాధ పడుతుంటే వీపు నిమురుతూ " మీ నాన్న గారికి నువ్వంటే ప్రాణం మేము చూస్తున్న సమయం లో నే నీ కోసం బంగారు నగలు తెచ్చే వారు.అతనికి జీతం బాగానే వచ్చేది.అతని కాగితాలన్నీ మరొక సారి క్షుణ్ణంగా వెతుకు ఏమైనా దొరక వచ్చు.వున్న అమౌంట్ లోంచి యింటివద్దే డైలీ నీడ్స్ లాంటి చిన్న షాపు పెట్టించు. వుద్యోగం కొన్నాళ్ళుచేసి మానేసి చేస్తుంటే డబ్బులు అందరూ సరిగా యివ్వరు ,అలాంటప్పుడు మనిషి నిస్పృహకి లోనవుతాడు.ఎవరో నీకు ఆసరా అవుతారని ఆశ పెట్టుకోకు, నువ్వే మీ ఆయనకి ఆసరాగా నిలబడి ప్రోత్సహించు   అతని యింట్రస్ట్ ఏమిటో తెలుసుకుని ఆ దిశగా చెయ్యడం మంచిది  నీ ఫొన్ నంబరు యివ్వు ప్రతి వారం నీకు ఫోను చేస్తాని. నీ కన్నా బలహీనులు అధమ పరిస్తితిల్లోవున్న వాళ్ళు ఎలాగో ఒకలాగ నిలదొక్కు కుంటున్నారు.నువ్వు పెరిగిన వాతావరణం నీకు చేసిన గారాబంవల్ల నువ్విలా ఫీలవుతున్నావు.నీ చిన్నప్పుడు నీ కోసం స్నేహితుల్ని కూడా అంకల్ వెతికి పెట్టే వారు అలాంటి వాళ్ళలో నేనొకర్తిని. ఇలా నిరాశా నిస్పృహలతోవుంటే నీ భర్తని ఎలా వుత్సాహ పరుస్తావు?సరే నీ  ట్రైనుకి అనౌన్స్మెంటు అయింది .నీకు ఎటు వంటి సహాయం కావాలన్నా నిస్సంకోచంగా ఫోను చెయ్యి.షాపు పెట్టే విషయ మ్మరోసారీ ఆ లోచించు.ఎందుకంటే అతను  ఎప్పటికి నీ కళ్ళ ముందు వుంటాడు అతనికి నీ సహాయం నీ కు అతని సహాయం అందుతుంది.ఏ పని చెయ్యాలన్నా ఒకరికొకరు తోడుగా వుంటారు.బై వుంటాను మరి."

రైలెక్కించి వై టింగ్కి రూముకి వెళ్ళాను.

రైలు కోసం నిరీక్షిస్తున్నంత సేపు నేస్తం చిన్న తనం గుర్తు కొచ్చింది

ఒక రోజు గురుమూర్తి గారు అదే రాణి వాళ్ళ నాన్నగారు సాయంత్ర సమయంలో మా యింటికి వచ్చారు, మా నాన్న గారు పేపరు చదువుకుంటున్నారు."నమస్కారం మాష్టారూ."తలెత్తి "నమస్కారం క్షమించండి మీరు." ఈ వూరికి కొత్తగా వచ్చాను ఇరిగేషన్ డిపార్ట్ల మెంటిలో సివిల్ ఇంజినీర్ గా.  చేస్తున్నాను." "రండి కూర్చోండి.". మేము వచ్చి వారం అయింది మాకు ఒక్క అమ్మయి పేరు స్వర్ణ లత యింట్లో అంతా రాణీ అనిపిలుచుకుంటాము.మా పక్కింటి వాళ్ళు మీ అమ్మాయి  వుంది తనకి తోడుగా వుంటుందని చెప్పారు."

"గౌరీ."

"వస్తున్నా నాన్నా." లంగా వాణీ వేసుకున్న పదహారేళ్ళ అమ్మాయి వచ్చింది.

ఈ అమ్మాయా? మా పిల్ల కి పదేళ్ళు అయిదో తరగతి చదువుతోంది."

"మా చిన్నమ్మాయి గురించి చెప్పి వుంటారు,సునీతని పంపించమ్మా"

" ఏమిటి నాన్నా "అంటూ వచ్చాను కొత్త వ్యక్తిని చూసి "నమస్తే" అన్నాను."

"నువ్వేనా సునీత ఏం చదువుతున్నావు?"

"ఏడవ క్లాసు "

మా అమ్మయి రాణి వీధిలోనే నాలుగిళ్ళ అవతల మేడవుంది అదే మాయిల్లు,ఒక్క సారి నాతో  మా యింటికి రామ్మా నీకు పరిచయం చేసి మళ్ళీ యింటి దగ్గర దింపేస్తాను." "అయ్యొ మీరు దిగబెట్టడమెందుకు వూరంతా చుట్టి వస్తుంది. వెళ్ళమ్మా అంకల్చెప్తున్నరు ఒక్కసారి కలుసుకో రోజూ ఆడుకుందికి వెళ్ళొచ్చు."

రోజు వెళ్ళాను పేరు రాణి యువ రాణిలా వుంది, పెళ్ళికో పేరంటానికో బయలు దేరినట్ట్లు,పట్టు లంగా జాకెట్టు మెడలో గొలుసులు వడ్డాణం చేతులకు  బంగారు గాజులు   పాపిడి బొట్టు "బాపురే!" అనుకున్నాను. వాళ్ళ నాన్నగారు మాయిద్దరి చేతులు కలిపి పరిచయం చేశారు.వాళ్ళ మామ్మగారికి అమ్మగారికి కూడా పరిచయం చేశారు.నమస్కారం పెట్టాను.

"సరే నేను యిప్పుడు వెళ్ళి రేపు వస్తాను."

 "అయ్యో అప్పుడే వైపోతావా?ఒక గంట ఆడుకుని వెళ్ళు".  అంది రాణి.కాదనలేక ఒక గంట కూర్చున్నాను.రాణిని గమనించినదేమిటంటె, ఆట అయిదు నిముషాలకి మించి ఆడదు,మొదల్లు పెట్టిన ఆట తను గెలవ వలసిందే .లేకుంటే అది కలిపేసి యి మరో ఆట మొదలు పెడుతుంది.  అమ్మా నాన్నగరితో రాణి మనస్తత్త్వం గురించి చెపితే "పోనీయమ్మా! ఒక్క పిల్ల కావడం నుంచి ఎక్కువ గారాబం చేసి అలా తయారై వుంటుంది. ఆ వారం లో నే ఒక్ రోజు నేను వెళ్ళగానే "సునీతా యీ రోజు నుంచి మనిద్దరం నేస్తం  కడదాం". "అదేమిటి నేనెప్పుడూ కట్టలేదు" "ఇప్పుడు కట్టి చూడు " నేస్తం కట్టిన వాళ్ళనిపేరు పెట్టి పిలవ కూడదు..నేస్తం అనే పిలవాలి.వాళ్ళతోనే యిష్టంగా వుండాలి.కూర్చో " అంటూ పళ్ళెంలో నీళ్ళు పోసి ఎదురెదురుగా కూర్చోమని చిటికెన వేళ్ళు పట్టుకుని పళ్ళెం చుట్టూ తిప్పుతూ నువ్వు నా నేస్తం నేను నీ నేస్తం అంటూ మూడు సార్లు తిప్పించింది.యీ రోజు నుంచి నేస్తం తోనే యిష్తంగా వుండాలి

."బాగుంది యిది కూడా ఒక ఆటలాగే వుంది.

వాళ్ళ నాయనమ్మగారు"అమ్మా!  నీతో నేస్తం కట్టాలని మూడురోజుల నుంచి ప్రయత్నం యీ రోజు ఎలాగైనా నేస్తం కట్టేయాలనుకుంది .మీ యిద్దరినీ భవగంతుడు చల్లగా చూడాలి."

అయోమయంగా చూశాను. మా నాన్న గారికి ట్రాన్స్ఫర్ల వుద్యోగంఒకటి రెండేళ్ళకి  మించి ఏవూర్లోని వుండరు. యిలా నేస్త్తాల్ని కడితే ఎంత మందవుతారో .

మరుసటి సంవత్సరమే నాన్న గారికి బదిలీ అయి వేరే వూరు వెళ్ళి పోయాం  అప్పుడు రాణి చాలా బాధ పడింది,నీలా  అడుకునే వాళ్ళు దొరకరు.అంటూ ఏడిచింది. తెలిసి తెలియని వయసులో అంతకన్నా మమతలు మమకారాలూ తెలియవు.మళ్ళీ యిన్నాళ్ళకి యీ విధంగ కలిపింది.

నా రైలు రావడం మర్నాడు గమ్యం చేరుకోవడం జరిగింది.

వారం తరువాత రాణి వద్ద నుంచి ఫోను వచ్చింది.దుకాణం పెట్టి చూసుకుందికి వాళ్ళాయన యిష్టపడ్డాడుట.యింకొకటి అడిగింది,వాళ్ళ అద్దె యింటికి బేంకు వాళ్ళే కొత్తవాళ్ళు వచ్చారుట భార్యా భర్తలిద్దరూ బేంకు వుద్యోగులే. వాళ్ళకి ఆరు నెలల బాబు వున్నాడుట ప్రొద్దుట పది నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు చూసుకో గలరా ఫ్రీగా కాదు నెలకు మూడు వేలిస్తామన్నారు ముందుగా మా వారిని అడిగాను బాగుంది నాకు వీలున్నప్పుడు నేను చూస్తాను అన్నారు.నీకు చెప్పి ప్రారంభిద్దామనుకుంటున్నాను నేస్తం. దుకాణం ప్రారంభించడానికి ఆరు నెలలు పట్టవచ్చు ,అందాకా చంటి వాడితో "శ్రీ గణేష్ "చేద్దామనుకుంటున్నాను.ఫొన్లో సంభాషణ విన్నాక నేస్తం మాటల్లో స్వరంలో ధైర్యం నమ్మకం తెలుస్తోంది.

"శుభస్య శీఘ్రం"అన్నాను. వారం వారం ఫోను చేసిజరుగుతున్న విషయాలు టూకీగా   చెప్పేది. ఆరు నెలలు గడిచాయి, "నేస్తం తీరికగా వున్నావా?" "1 ! చెప్పు చెప్పు ఏమిటి సంగతి? ?" "సంగతి పెద్దదే ! నే పెంచుతున్న బాబు ఏడాది వాడై తప్పటడుగులు వేస్తున్నాడు.మా యిద్దరికీ  బాబంటే చాలా ముద్దు,మా పెళ్ళయి పదేళ్ళైనా నాకు పిల్లలు కలుగ లేదు. నేనున్న పరిస్తితిలో అదీ ఒక మంచికే అనుకునేదాన్ని. నిన్ను కలిశాక నా ఆశలని ఆశయాలని వుత్సాహపరిచి ఊపిరి పోశావు.బాబుని పెంచితే నాలో మాతృత్త్వం మేలుకొని నా కడుపులో మరో ప్రాణి వూపిరి పోసుకుంటోంది.యిప్పుడు మూడో నెల  మా వారు చాలా ఉత్సాహంగా వున్నారు. ఇంకొకటి చెప్పనా? నాన్నగారి సామాన్లన్నీ చెక్ చేస్తుంటే వాలెట్లోంచి మూడు లక్షల సర్టిఫిచెట్లునా పేరున నామినీగా రాసిపెట్టారు. అవన్నీ కేష్ చేయించి ఫిక్సిడ్ వేయించాను..యిప్పుడు నాకు చాలా ధైర్యంగా వుంది నేస్తం. అందరికీ నీలాంటి ఒక్క నేస్తం వుంటే చాలు ."  అది విన్నాక నాగుండె సంతోషంతో నిండిపోయింది." "ఆల్ ద బెస్ట్ నేస్తం". 

31 March, 2018


    సౌఖ్యము చాలు
 హనుమంతరావు యింట్లో ప్రవేశిస్తూనే వుస్సురంటూ పై మీది కండువా దులిపి వాలు కుర్చీలోకూలబడ్డాడు.భర్త అలికిడి విని చల్లటి మంచినీళ్ళ గ్లాసు అందించి "చాలా దూరం నడిచారా? అలిసిపోయినట్లున్నారు"
అబ్బే! ప్రక్కనున్న పార్కులో కూర్చున్నాను.అక్కడ పిల్లలు కలకిలలాడుతూ వుయ్యాలలూగుతూ జారుడు బల్ల జారుతూ కేరింతాలు కొడుతూ ఆడుతూంటే మనింట్లో లోటేమిటో తెలిసి మనసంతా దిగులుతో నిండి పోయింది. వారం రోజులై పిల్లలందరికీ వేసవి శలవల్లో రమ్మని ఫోను చేస్థున్నాను.పెద్దాడు బెజవాడలో యిల్లు కట్టుకునే ప్రయత్నంలో వున్నాను,  ఏడాది వీలవదు అన్నాడు.వున్నవాళ్ళకి ఏవో కారణాలు పుట్టుకొచ్చాయి. చిన్నదాని నువ్వన్నా కుటుంబమంతా రండి అంటే వాళ్ళాయనకి ఏవో పరీక్షలున్నాయి చదువుకోవాలంది.ఏటికేడాది పిల్లలకోసం ఎదురు చూపులు చూస్తే యిదీ వరస.
"ఏం చెయ్యగలం? ఎల్లకాలం ఒకేలా వుండాలంటే ఎలా? నిజంగానే వాళ్ళకి అవకాశం లేదేమో.
"అలా అనుకోవడం నీ వెర్రితనం.

పెద్దాడు యిల్లు కట్టుకుందికి లోనుకి అప్లై చేశాడుట అది శాంక్షను అవటానికి టైము పడుతుంది,యీ లోగా పని మొదలు పెడతాను ఒక లక్ష పంపు నాన్నా అన్నాడు ఫొనులో కిందటి వారం.నా దగ్గర అంత డబ్బెక్కడిదిరా పెద్ద చెల్లి పెళ్ళికి అంటు మామిడి తోట అమ్మి పెళ్ళి చేశాను. చిన్నదాని పెళ్ళికి మూడెకరాల పొలం అమ్మేశాను.తాతలనాటి యీ యిల్లు నా పెన్షను తప్ప వేరేఆదాయం ఏముంది?సర్వీసులో వున్నన్నాళ్ళు నిజాయితీగా బ్రతికాను, ఒక్క కాణీ వెనకేసుకోలేదు నేనేమీ సాయం చెయ్యలేను నీ స్వశక్తిమీద ఏర్పర్య్చుకోమని ఖచ్చితంగా చెప్పాను.  దాని పరిణామమే యిది. అందరూ కలిసి నామీద కక్ష సాధిద్దామనుకుంటున్నారు." అంటూ నిట్టూర్చారు.భర్త మాటల్లో నిజం లేక పోలేదు అనుకుని మౌనం వహించింది అనసూయ.

మర్నాడు అదే ధోరణి భర్తకి వూరడింపు మాటలు చెప్పడానికే కరవయ్యాయి.అతనికి మనుషులు కావాలి.వేసవి వచ్చిందంటే ముగ్గురు కొడుకులు కోడళ్ళు అయిదుగురుమనుమలు యిద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు నలుగురు మనుమలు వస్తే యిల్లు నిండుగా వుంటుదని ఆయన ఆశ.

              పిల్లల కోసం పెరట్లో వుయ్యాల వేయించి  తాటి మంజలు చెరుకు గడలు మామిడి పళ్ళు తెచ్చి సంబర పడేవారు.అనసూయకూడా అరిసెలు జంతికలు చిట్టి చేగోణీలు పిల్లలకోసమనే ఏమిటి అందరికోసం మనిషిని పెట్టి చేయించేది.వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వస్తున్నాదని ఒక్కరోజు భర్తని అడగ లేదు,ఫలానా యిబ్బందని భర్త చెప్పలేదు.
ఈ రోజు భర్త డ్బ్బు గురించి మాట్లాడుతుంటే విచిత్రమనిపించింది. అదే మాట అతనితో అంటే "పదే పదే అనుకుంటే యిబ్బంది తగ్గదు,అంతగా అవసరం పడితే పదివేల దాకా మన సుబ్బరాజు సర్దేవాడు.వీలు చూసుకుని తీర్చేసేవాడిని.అతనే రెండేళ్ళ క్రితం సలహా యిచ్చాడు,అమ్మినవి పోగా ఒక చిన్నజాగా చెరువుకింది భాగంలో వుంది కదా ఎప్పుడు పచ్చి గడ్డి పెరిగి పశువులు మేసేవి లేక పశువులకోసం కోసుకెళ్ళేవారు.దానికి కంచె వేయించమని తనకి తెలిసిన వ్యక్తి వున్నాడు అతనికి కూరగాయల పెంప్కంపై మంచి అవగాహన వుంది. చెరువు దిగువలో వున్న పొలం కావున ఎక్కువ నీరు అవుసరం వుండదు అతనిచేత కూరగాయలు పండించితే ఏడాది పొడుగునా మనకి సరిపడా కూరలు దొరుకుతాయి,ఎక్కువైన వాటిని బజార్లో అమ్మి మనకి సగం యిచ్చి తను సగం వుంచుకుంటాడని చెప్పాడు.అప్పటినుండి చిన్నా చితకా వాటికి యిబ్బంది పడటం లేదు.కొంతసొమ్ము వెనకేసి పిల్లలు వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నాను.అంతేగాని నాచేతిలో లక్షలు మూలగటం లేదు." 
:పోనీండి బాధ పడకండి. పిల్లలందరికీ చదువులు చెప్పించి  ప్రయోజకుల్ని చేశాం.పెళ్ళిళ్ళు చేసి ఎవరి సంసారం వాళ్ళకి ఏర్పాటు చేశాం. వయసులో యింకేం చెయ్యగలం" అంటూ వూరడించింది అనసూయ.
మర్నాడు రాత్రి భోజనాలయాక భర్త కుర్చీ పక్కన కూర్చుని " మీరు శాంతంగా వింటానంటే ఒక్క మాట చెప్తాను." అంటూ పర్మిషను కోసం అగింది.ఏమిటన్నట్లు చూశ్శారు.హనుమంతరావు.
"ప్రతి  సంవత్సరం మనంపిలిచినా  వాళ్ళకి అవకాశం వుండొచ్చు వుండకపోవచ్చు,వాళ్ళ యిబ్బందులు వాళ్ళవి మనకిప్పుడు శలవు పెట్టుకోవాలన్న చింత లేదు పెద్ద యిల్లు వుందనే తప్ప మరే కారణం లేదు .మనమే ఒక పదిహేను యిరవై రోజులకోసం పిల్లల దగ్గరకెళ్ళితే వాళ్ళూ సంతోషిస్తారు మనకి కొంత మార్పు వుంటుంది.
అన్నట్లు  మన హాస్పిటల్ కంపౌండరు యీ రోజు సాయంత్రం కనిపించి అడిగాడు, మనకి యింత యిల్లు వుందికదా వుండేది మనమిద్దరమే  యీ వూరికి ట్రాన్స్ఫర్ అయి కొత్తగా డాక్టరు కుటంబంతో సహా వచ్చారుట.స్నేహితుడింట్లో భార్య యిద్దరు పిల్లలతో వున్నారుట మన యింటిలో పక్క వాటా అద్దెకిస్తామా అంటూ అడిగాడు.పిల్లలతో వాళ్ళు అద్దెకి వుంటే మనకి కాస్త ఒంటరితనం తగ్గుతుంది.ఏడాదిలో ఒక వారం రోజుల కోసం వచ్చే మనుమల కోస పిల్లల కోసం ఎదురు చూపులు చూసేకన్నాయింట్లో రోజూ వుండే పిల్లలతో సాన్నిహిత్యం పెంచుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి."

" మన పిల్లలు వచ్చినప్పుడు యిల్లు యిరుకవుతుండేమో", సందేహంవెలి బుచ్చాడు హనుమంతరావు." మీది మరీ చాదస్తం యింతకన్నా చిన్న యిళ్ళలో మనుషులు వుండటం లేదా?సర్దుకుంటారు.మీరు సరేనంటే రేపు కంపౌండరుకి చెప్తాను. రోజూ మనింటి మీంచే హాస్పిటలికి వెళ్తాడు. హనుమంతరావుకి కూడా యీ ఆలోచన నచ్చింది.కాని డబ్బు కక్కుర్తి కోసం యిల్లు అద్దె కిస్తున్నామనుకుంటారేమొ మెల్లిగా గొణిగాడు..
మర్నాడు కంపౌండరుచేత కబురు చేసంది అనసూయ.ఆడవాళ్ళు యిటువంటి విషయాల్లో వెనుకడుగు వేయకుండా నిర్ణయాలు తీసుకుంటారని నవ్వు పారేశాడు హనుమంతరావు.
సాయంత్రం డాక్టరు భార్యా బిడ్డలతో కంపౌండరుని తీసుకుని వచ్చారు. కంపౌండరు పరిచయం చేశాడు.
"నమస్కారం బాబయ్యగారూ నమస్కారం పిన్నిగారూ"అంది డాక్టరుగారి భార్య వాణి.డాక్టరు చిరునవ్వుతో నమస్కరించాడు.వాళ్ళ పెద్దబ్బాయి ఆరేళ్ళవాడు చిన్నవాడు ఎనిమిది నెలలవాడు.
" నా పేరు సారధి నా భార్య వాణి."
"రండి బాబూ కూర్చోండి" అంటు కుర్చీలు చూపింది అనసూయ."మంచి నీళ్ళు యిమ్మన్నారా?"
"వద్దమ్మా ఎకువ దూరం నడవ లేదు కావాలంటే అడుగుతాను. డాక్టరు మాటలో వండవలసిన మార్దవం చాలా వుంది  కంపౌండరుకంపండరు "బాబూ మీరు మాట్లాడుకోండి నేను వస్తాను, మీరిద్దరూ  పెద్ద వాళ్ళై పోయారు,యింత యింటిలో ఒక్కరూ రాత్రి పూట అవసరం వచ్చినా ఒకరిని వంటరిగా వదిలి రెండో వాళ్ళు వెళ్ళలేరు యింటిలోనే డాక్టరూగారుంటే అవసరం పడితే సహాయ చెయ్యగలరు." అనగానే హనుమంతరావు "ఏనాడూ యీ కోణంలో ఆలోచించలేదయ్యా,నీ సజెషను చాలా బాగుంది"
డాక్టరుగారూ!మా యిల్లు రెండు వాటాలుగా వున్నా యిండిపెండెంటుగా లేదు.వాకిలంతా కలిసే వుంది దీనిని విభజించలేం"

"అయ్యో మీరు నన్ను డాక్టరుగారూ అంటూ మన్నించవద్దు తండ్రిలాంటివారు,మాకు యిలాంటి యిల్లైతేనే సంతోషం. రోజూ మీ యిద్దరూ కనిపిస్తూ వుంటారు.మా వాణికి మనుషుల్లేకపోతే నన్ను సతాయిస్తూంటుంది".వాణి నవ్వేసింది.

"కాఫీ చేస్తాను."అంది అనసూయ."యిది మాత్రం కాదనకండి"అన్నారు హనుమంతరావు.
"నేనూ సాయం చేస్తాను పిన్నిగారూ"అంటూ వెనుకే వెళ్ళింది వాణి."ఎల్లుండి దశమి వచ్చేయండి రేపు మనిషని పెట్టి యిల్లు శుభ్రంగా కడిగించేస్తాను." 
"అద్దె గురించి మీరేమీ చెప్పలేదు,"అన్నాడు సారధి."మీకెంత యివ్వాలనుకుంటే అంతే యివ్వండి ,డబ్బులకోసం కన్నా మనుషులు సందడి కోసం అద్దెకిస్తున్నాను."
అక్కడ డబ్బు ముఖ్యం కాదన్నది అర్ధమైంది సారధికి."మాకు గవర్నమెంటు హౌస్ అలవెన్సు ఎనిమిది వేలు యిస్తుంది అది చాలదంటే మీరెంత చెబితే అంత యిస్తాను."
" ఎనిమిది వేలే చాలు మీరు వచ్చేయండి"
వంటిటిలోంచి కాఫీ బిస్కట్లు వచ్చాయి .ప్లాను చెప్పగానే" సరే ఎల్లుండి పాలు పొంగించి సామాన్లు పెట్టేసుకుంటాం. ట్రాన్స్ఫర్ల వాళ్ళం కదా సామాను ఎక్కువ లేదు.ఎంత అవసరమో అంతే వుంది"అంది వాణి.
వాళ్ళు యిల్లు మారిన మర్నాడు అలవాటుగా పెరటి వరండాలో వాలు కుర్చీలో కూర్చున్నారు హనుమంతరావు.గదిలొ పడుక్కో పెట్టిన చంటివాడు బంగురుతూ వచ్చి తాత తాత అంటూ హనుమంతరావు కాలిమీద చిట్టి చేయి వేసాడు.వెంటనే చూసి "నువ్వురా బుజ్జీ దా!"అంటూ ఎత్తుకుని గుండెలమీద కూర్చో పెట్టుకున్నారు.
అనసూయ చూసి "చాలా సంతోషంగా వుంది,యిల్లు కళకళ లాడిపోతోంది.పిల్లలు భగవత్స్వరూపులు వాళ్ళకి తనపర బేధం వుండదు"
వాణి బయటికి వచ్చి 'బాబయ్యగారూ వీడు మీ దగ్గరకొచ్చాడా?"
"రానీయమ్మా యీ ఆనందం కోసమే వారం రోజులై కొట్టాడి పోయాను మాకింత కన్నా ఏం కావాలి? ఈ సౌఖ్యం చాలు."